Hanmakonda: హన్మకొండలో ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో బతుకమ్మ సంబరాలు
Hanmakonda: హన్మకొండలోని తన నివాసంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Hanmakonda: హన్మకొండలో ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో బతుకమ్మ సంబరాలు
హన్మకొండ: హన్మకొండలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు*
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హన్మకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు పాల్గొన్నారు.
తన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా సంప్రదాయ పాటలు, ఆటపాటలతో సందడి చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చారు.
కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.




