Bhupalpally: సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ వెంకటరమణ రెడ్డి!
Bhupalpally: సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని భూపాలపల్లి ఏరియా 5 ఇంక్లైన్ వద్ద మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి.
Bhupalpally: సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ వెంకటరమణ రెడ్డి!
Bhupalpally: సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూపాలపల్లి సింగరేణి ఏరియా 5 ఇంక్లైన్ లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజీ రెడ్డి హాజరయ్యారు. అయితే లోనికి వెళ్లే క్రమం లో brs నాయకులకు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు... అయినప్పటి గేట్లు తోసుకొని లోనికి వెళ్ళారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఏ విధంగా ప్రజలు ,కార్మికుల సంక్ఖేమాన్ని విస్మరించిందో తెలియ జేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు..కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు, అనేక హామీలు ఇచ్చినట్లుగానే సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారెంటీల వాగ్దానాలు చేసిందన్నారు.కార్మికులు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినప్పటికీ, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ముఖ్యంగా విధుల్లో ఉండి అనారోగ్యానికి గురైన సింగరేణి కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కల్పించే విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. మెడికల్ బోర్డులను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందని, ఏర్పాటు చేసిన బోర్డుల ద్వారా కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు కార్మికులను తిరస్కరిస్తూ, తిరిగి సర్ఫేస్ విధులు లేదా యథావిధిగా డ్యూటీలు చేయాలని సూచిస్తున్నారని విమర్శించారు.




