Regonda: రేగొండ జ్యోతిరావు పూలే పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర!

Regonda: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల క్రాస్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 2 Oct 2026 7:10 AM IST
Regonda
X

Regonda: రేగొండ జ్యోతిరావు పూలే పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర!

Regonda: రేగొండ మండలం,లింగాల క్రాస్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యాలయంలోని వసతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం విద్యాలయంలో పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ, అక్కడక్కడా కొన్ని చిన్నచిన్న లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా తరగతి గదిలో ఫ్యాన్లు,లైట్లు సరియైన వెంటిలేషన్ అందుబాటులో లేకపోవడం,చిన్నపాటి మరమ్మతులు అవసరం ఉండటం వంటి సమస్యలను గుర్తించినట్లు తెలిపారు..

సంబంధిత అధికారులు వీటిని త్వరితగతిన పరిష్కరించి, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally