Hanumakonda: భూ రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్!

Hanumakonda: బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్‌లలో భూ రీసర్వేను వేగవంతం చేయాలని, తిరుమలగిరి కేజీబీవీలో నాణ్యమైన భోజనం అందించాలని శుక్రవారం ఎన్. రవి ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Nov 2026 5:00 PM IST
Hanumakonda
X

Hanumakonda: భూ రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్!

హనుమకొండ జిల్లా: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను గ్రామాలలో పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి సర్వేయర్లు, అధికారులను ఆదేశించారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం బ్రాహ్మణపల్లి, దామెర మండలం వెంకటాపూర్ గ్రామాలలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. రీసర్వే వివరాలు, జరుగుతున్న తీరును సర్వేయర్లను, స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి సర్పంచ్ తోట లక్ష్మి కుమారస్వామి,, ఆత్మకూర్ తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, సర్వేయర్లు, ఇతర అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

కేజీబీవీలో వసతులను పరిశీలించిన అదనపు కలెక్టర్

ఆత్మకూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం( కేజీబీవీ)ని అదనపు కలెక్టర్ ఎన్. రవి శుక్రవారం సందర్శించారు.

హాస్టల్లోని బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యవసరాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. వంటగదిలోని భోజన పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థిను లతో మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బూర దేవేంద్ర రాజేందర్, కేజీబీవీ ప్రత్యేక అధికారి, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్