Hanamkonda: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి: కలెక్టర్!
Hanamkonda: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి అధికారులను ఆదేశించారు.
Hanamkonda: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి: కలెక్టర్!
హన్మకొండ: హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార చర్యలపై టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార చర్యలు మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు తీసుకుంటున్న చర్యలు, వాటి పురోగతి గురించి సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ పోర్టల్ లో నమోదై ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని అన్నారు.
ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం వచ్చిన సంబంధిత దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, టౌన్ ప్లానింగ్ అధికారి జ్యోతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నస్రీన్ భాను, ప్రశాంత్, సాగునీటిపారుదల శాఖ అధికారులు వెన్నెల, ఇతర అధికారులు పాల్గొన్నారు.




