Seerole: వ్యవసాయ బావి వద్ద రైతు అనుమానాస్పద మృతి!
Seerole: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లిలో విషాదం వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో రైతు చంద్రశేఖర్ మృతి చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో పోలీసుల దర్యాప్తు.
Seerole: వ్యవసాయ బావి వద్ద రైతు అనుమానాస్పద మృతి!
సీరోల్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామ శివారు పల్లెగూడెం చెరువు సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మంద చంద్రశేఖర్ (బాబు) (49) తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో మృతిచెందాడు.
చంద్రశేఖర్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. సంఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.




