Jangaon: జనగామలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల రాస్తారోకో
Jangaon: జనగామలో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు రాస్తారోకో నిర్వహించి కలెక్టర్ జోక్యం కోరారు.
Jangaon
Jangaon: జనగామ మండలంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. వడ్లకొండ–గానుగుపహాడ్ బైపాస్ రోడ్డుపై రాజకీయ పార్టీల నేతలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడంతో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తూకం వేసిన ధాన్యం బస్తాలు కేంద్రాల్లోనే పేరుకుపోయాయని తెలిపారు.
తక్షణమే లారీలు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను పునఃప్రారంభించాలని, సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
Next Story




