Parkal: వరి రైతుల ఆందోళన.. నకిలీ విత్తనాలతో 150 ఎకరాల్లో పంట నష్టం!
Parkal: హనుమకొండ జిల్లా పరకాలలో నకిలీ WGL 44 వరి విత్తనాల వల్ల 150 ఎకరాల్లో పంట నష్టపోయామంటూ విక్రమ్ ట్రేడర్స్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.
Parkal: వరి రైతుల ఆందోళన.. నకిలీ విత్తనాలతో 150 ఎకరాల్లో పంట నష్టం!
Parkal: పరకాల పట్టణంలోని విక్రమ్ ట్రేడర్స్ ఎరువుల దుకాణం ముందు వరి రైతులు ఆందోళన చేపట్టారు. WGL 44 సిద్ది రకం వరి విత్తనాలు నకిలీవి ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
శాయంపేట మండలానికి చెందిన మూడు గ్రామాలకు చెందిన రైతులు సుమారు 150 ఎకరాల్లో ఈ విత్తనాలు వేశామని, ఎకరానికి రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టినా ఇప్పటి వరకు పంట గొలుసు కూడా వేయలేదని వాపోయారు.
నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దుకాణం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే వ్యవసాయ అధికారులు స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.




