Jangaon: జనగామ కోటిరత్న ఆసుపత్రి సమీపంలో అగ్నిప్రమాదం..

Jangaon: జనగామ 3వ వార్డు కోటిరత్న ఆసుపత్రి పక్కన భారీ అగ్నిప్రమాదం. ఎండ తీవ్రతకు ఎండిన గడ్డి, పిచ్చిమొక్కలకు అంటుకున్న మంటలు.

MD AHMAD PASHA, JANGAON
Updated on: 28 May 2026 9:31 PM IST
Jangaon
X

Jangaon: జనగామ కోటిరత్న ఆసుపత్రి సమీపంలో అగ్నిప్రమాదం..

జనగామ: జనగామలోని 3వ వార్డు, కోటిరత్న ఆసుపత్రి పక్కన గల వెయ్యి గజాల ఖాళీ స్థలంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎండ తీవ్రతకు అక్కడి పిచ్చిమొక్కలు, ఎండిన గడ్డికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో సకాలంలో చేరుకుని మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. సీఐ సత్యనారాయణరెడ్డి, స్థానిక కౌన్సిలర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితి అదుపులో ఉందని అధికారులు పేర్కొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story