Garla: బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా పంజాల ఐలయ్యకు డాక్టరేట్

Garla: గార్ల మండలానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ప్రముఖ కవి పంజాల ఐలయ్య హైదరాబాద్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 7 Nov 2026 8:51 PM IST
Garla
X

Garla: బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా పంజాల ఐలయ్యకు డాక్టరేట్

మహబూబాబాద్ జిల్లా: గార్ల మండలానికి చెందిన విశ్రాంత బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు, ప్రముఖ కవి, రచయిత పంజాల ఐలయ్య హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు.

ఉపాధ్యాయ వృత్తిలో తనదైన ముద్ర వేస్తూ, మరోవైపు సాహిత్య రంగంలో కవిగా, రచయితగా విశేష గుర్తింపు పొందిన పంజాల ఐలయ్యకు ఈ గౌరవం దక్కడం పట్ల గార్ల ప్రాంత ప్రజలు, సాహితీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సాధించిన ఈ ఘనత గార్ల మండలానికి గర్వకారణంగా నిలిచిందని పలువురు అభినందిస్తున్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM