Jangaon: దేవరుప్పులలో బోనాల వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్!

Jangaon: దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం, చౌడూరు గ్రామాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 30 Aug 2026 11:28 PM IST
Jangaon
X

Jangaon: దేవరుప్పులలో బోనాల వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్!

Jangaon: దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం గ్రామంలో ముత్యాలమ్మ బోనాలు, చౌడూరు గ్రామంలో పోచమ్మ బోనాల పండుగలో పాల్గొని ముత్యాలమ్మ తల్లిని, పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రితో పాటు మండల నాయకులు,ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story