Mahabubabad: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు షురూ!

Mahabubabad: కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 18 Jun 2026 9:58 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు షురూ!

Mahabubabad: కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ. ఆర్) ప్రక్రియ పై బీఆర్ఎస్ చేనులో అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనిమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంప్ కార్యాలయంలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అంశాలపై కార్యకర్తలకు మాజీ మంత్రి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగుతుందని, దీని కోసం పార్టీ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా కార్యకర్తల పూర్తి వివరాలను సేకరించి డిజిటల్ సభ్యత్వ కార్డులను జారీ చేయనున్నామన్నారు.

బెంగాల్, భీహార్ రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగించారని, ఇక్కడ కూడా అదే పద్ధతిని కొనసాగిస్తారని అనుమానం వ్యక్తం చేశారు. గ్రామాల్లో స్థానికుల ఓట్లు ఏ కారణం చేత కూడా తొలగిపోకుండా నిశితంగా పర్యవేక్షించాలని బీఎల్ఏ లకు సూచించారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేతలను సమన్వయం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు తోసమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story