Parkal: పరకాలలో దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి.. చల్లా ధర్మారెడ్డి!

Parkal: నవంబర్ 29న పరకాలలో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపు. కేసీఆర్ దీక్షను స్మరించుకున్న నేతలు.

M PRABHAKAR, PARAKAL
Published on: 26 Nov 2026 11:58 AM IST
Parkal
X

Parkal: పరకాలలో దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి.. చల్లా ధర్మారెడ్డి!

Parkal: తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ గారి దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచి రాష్ట్ర సాధనకు బాటలు వేసిందని అన్నారు. ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్షతోనే తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైందని, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారని కొనియాడారు.ఈ నెల 29న పరకాలలో దీక్షా దివస్ఈ నెల 29న పరకాలలో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చల్లా పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆ రోజును గుర్తు చేసుకోవాలని, కేసీఆర్ గారి త్యాగాన్ని, పోరాట స్ఫూర్తిని యువతకు తెలియజేయాలని సూచించారు. దీక్షా దివస్ కార్యక్రమం పరకాల నియోజకవర్గంలో ఘనంగా జరగాలని, ఉద్యమ స్ఫూర్తి మరోసారి ప్రతిబింబించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని స్మరించుకుని నివాళులర్పిస్తామని తెలిపారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL