Parkal: పరకాలలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ 420 అడుగుల ఫ్లెక్సీ నిరసన!

Parkal: పరకాలలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో భారీ నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టింది.

M PRABHAKAR, PARAKAL
Published on: 2 Sept 2026 4:28 PM IST
Parkal
X

Parkal: పరకాలలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ 420 అడుగుల ఫ్లెక్సీ నిరసన!

Parkal: అంబేద్కర్ కూడాలి నుండి కూరగాయల మార్కెట్ వరకు 420 అడుగుల కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీల వైఫల్యాల ఫ్లెక్సీ తో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. అనంతరం బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు,

రైతు భరోసా అన్నీ మోసపూరిత హామీలే. 1000 రోజులైనా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదు.ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి,అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లో ప్రతి హామీ నెరవేరుస్తాం అని బాండ్, పేపర్లు రాసి ఇచ్చి 1000 రోజులు అయిన కూడా హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

సకాలంలో ఇవ్వాల్సిన యూరియా ఇవ్వకుండా అప్ తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ అప్ ద్వారా రైతులు ఒక మండలం నుండి మరొక మండలం కి వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది అని మండిపడ్డారు. పరకాల నియోజకవర్గ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story