Bhupalpally: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గండ్ర మద్దతు!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 13 Oct 2026 1:57 PM IST
Bhupalpally
X

Bhupalpally: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గండ్ర మద్దతు!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించి తమను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఆయుష్ వైద్యులు మరియు సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టారు.

సుదీర్ఘకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్న NHM ఉద్యోగులను, వైద్యులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలనీ. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులందరికీ 100% గ్రాస్ శాలరీ చెల్లించాలనీ డిమాండ్ చేశారు కరోనా లాంటి విపత్కర సమయం లో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన nhm వైద్యులు సిబ్బంది న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలన్నారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally