Tekumatla: మానేరు వాగులో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న బీఆర్ఎస్

Tekumatla: టేకుమట్ల బూర్నపల్లి మానేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నిరసన. లారీలను అడ్డుకున్న గండ్ర వెంకటరమణ రెడ్డి. అధికారులపై తీవ్ర ఆగ్రహం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 7 July 2026 6:39 AM IST
Tekumatla
X

Tekumatla: మానేరు వాగులో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న బీఆర్ఎస్

టేకుమట్ల: టేకుమట్ల మండలం బూర్నపల్లి గ్రామ శివారులోని మానేరు వాగులో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నాయకులు సోమవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జేసీబీలతో ఇసుకను తవ్వి టిప్పర్లలో లోడ్ చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న నాయకులు వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు.. ఈ నిరసన లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు.

కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి పేరుతో అనుమతి లేకుండా వాగు నుంచి ఇసుక తరలిస్తున్నారనీ లారీలను అడ్డుకుని అధికారుల పై మండి పడ్డారు.వాగులో నుంచి ఇసుక తవ్వకాలకు ఎవరి ప్రమేయంతో మీరు అనుమతి ఇచ్చారని తహసీల్దార్, సీఐలను ప్రశ్నించారు.అనుమతి లేకుండా భారీ స్థాయిలో ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమని విమర్శించారు.

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇసుక మాఫియా విచ్చలవిడిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story