Parkal: పరకాల పహాల్ ఫైనాన్స్ సంస్థలో రూ.5.20 లక్షల గోల్‌మాల్!

Parkal: పరకాల పట్టణంలోని ఆకుల వార్డులో ఉన్న పహాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగి నరేష్ కుమార్ రూ.5.20 లక్షలు గోల్‌మాల్ చేసినట్లు ఆడిట్‌లో తేలింది.

M PRABHAKAR, PARAKAL
Published on: 24 Nov 2026 5:34 PM IST
Parkal
X

Parkal: పరకాల పహాల్ ఫైనాన్స్ సంస్థలో రూ.5.20 లక్షల గోల్‌మాల్!

పార్కళ్: పరకాలపట్టణంలోని ఆకుల వార్డులో ఉన్న పహాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.ఆ సంస్థలో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్న వార్త నరేష్ కుమార్ అనే ఉద్యోగి రూ. 5,20,000లను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు కంపెనీ అధికారులు గుర్తించారు.కంపెనీకి చెందిన వసూళ్లు, ఖాతాదారుల నుంచి సేకరించిన డబ్బులను బ్యాంకు ఖాతాలో వేయకుండా అవకతవకలు జరిగినట్లు ఆడిట్‌లో తేలినట్లు సమాచారం.

దీంతో కంపెనీ యాజమాన్యం అతనిపై పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని విచారించి, నగదు ఎలా వాడుకున్నాడు, ఎక్కడ ఖర్చు చేశాడనే కోణంలో ఆరా తీస్తున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL