Bhupalpally: భూపాలపల్లిలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో ఎంపిక పరీక్షల నిర్వహణ.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 6 Sept 2026 2:19 PM IST
Bhupalpally
X

Bhupalpally: భూపాలపల్లిలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్!

Bhupalpally: భూపాలపల్లిలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం యువతకు ఉచిత కోచింగ్ అందించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు జిల్లాలోని యువతకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఆదివారం భూపాలపల్లి ఎస్పీ కార్యాలయంలో అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలతో పాటు రాత పరీక్షలు నిర్వహించారు.

జిల్లాలోని 12 మండలాల నుంచి యువతి, యువకులు ఈ పరీక్షలకు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు. మరో వైపు సింగరేణి స్కూల్ లో పోలీస్ శాఖ లో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువత కు వ్రాత పరీక్ష నిర్వహించారు కాగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఎగ్జామ్ సెంటర్ ను తనిఖీ చేశారు.

పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న యువతకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ, పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని యువతకు సూచించారు.

పోలీస్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంత యువతకు ఈ 70 రోజుల ఉచిత కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ కోరారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally

Next Story