Warangal: నల్లబెల్లిలో జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం!
Warangal: వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జనతా ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 600 మందికి పరీక్షలు నిర్వహించారు.
Warangal: నల్లబెల్లిలో జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం!
వరంగల్: నల్లబెల్లి మండలం కేంద్రంలో లోని సుమంగళి ఫంక్షన్ హల్ లో జనతా ట్రస్ట్ మరియు శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. రెండో విడత కంటి వైద్య శిబిరానికి 600 మంది ప్రజలు హాజరై నిపుణులు అయిన వైద్యుల చే ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.
వైద్యుల సలహా మేరకు అవసరమైన వారిని తదుపరి చికిత్స కోసం ఎంపిక చేసారు. మరియు ఉచితంగా కళ్లద్దాలు, కంటి ఆపేరేషన్లు అందించేలా చర్యలు చేపట్టారు. కార్యక్రమం లో బీజేపీ నాయకులు జనతా ట్రస్ట్ చైర్మన్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.
Next Story




