Parkal: పరకాలలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు!

Parkal: హనుమకొండ జిల్లా పరకాలలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 2 Oct 2026 5:05 PM IST
Parkal
X

Parkal: పరకాలలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు!

Parkal: హనుమకొండ జిల్లా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు పరకాల మండల ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక మైదానం లో గల గాంధీ విగ్రహానికి పాలాభిషేకం మరియు పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగినది.

ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఆవోప రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా నాగబండి విద్యాసాగర్ , ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ జిల్లా కోశాధికారి శ్రీరాం రవీందర్ , పరకాల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు చిటికేసి కృష్ణమూర్తి , ఉమా కృష్ణమోహన్ ఎక్కటి రమేష్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవా సతీష్ కుమార్ భూపతి లక్ష్మీపతి అలాగే ఆర్యవైశ్య యువజన సంఘం కన్వీనర్ డాక్టర్ గంప శ్రీనాథ్ , కోశాధికారి అకినెపెల్లి విద్యాసాగర్ , ప్రధాన కార్యదర్శి యర్ర సుధీర్ కుమార్ , కిరాణావర్తక సంఘం అధ్యక్షులు గంగిశెట్టి కిరణ్ కుమార్ , పరకాల ఫర్టిలైజర్ అసోసియేషన్ కోశాధికారి ఎర్ర లక్ష్మణ్ మరియు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

తర్వాత ఆర్యవైశ్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో పరకాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ మరియు పలువురి డాక్టర్ల సమక్షంలో బ్రెడ్డు మరియు పండ్లు పేషెంట్లకు పంచడం జరిగింది.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL