Warangal: గ్రేటర్ వరంగల్ బల్దియాలో గాంధీ జయంతి!

Warangal: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా, అధికారులు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 2 Oct 2026 7:53 PM IST
Warangal
X

Warangal: గ్రేటర్ వరంగల్ బల్దియాలో గాంధీ జయంతి!

వరంగల్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, వింగ్ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను, ఆయన చూపిన సత్యం, అహింస మార్గాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, CHO లక్ష్మారెడ్డి, MHO డాక్టర్ రాజేష్, ఉప కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు, హార్టికల్చర్ ఆఫీసర్ ప్రశాంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంజయ్ కుమార్, రవికుమార్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST