Bhupalpally: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి!

Bhupalpally: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 3 Sept 2026 2:35 PM IST
Bhupalpally
X

Bhupalpally: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి!

Bhupalpally: ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మొండిచేయి చూపుతోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

భూపాలపల్లి సింగరేణి ఏరియా 1 ఇంక్లైన్ లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజీ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఏ విధంగా కార్మికుల సంక్ఖేమాన్ని విస్మరించిందో వివరించారు.. .

అనంతరం గనిలోని సర్వే రూమ్‌ను సందర్శించిన నాయకులు, సర్వేయర్‌తో మాట్లాడి గని మ్యాప్, పనుల పురోగతి, భూగర్భ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. తర్వాత గని మేనేజర్‌ను కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, భద్రతా అంశాలు, సౌకర్యాల మెరుగుదలపై చర్చించారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు, అనేక హామీలు ఇచ్చినట్లుగానే సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారెంటీల వాగ్దానాలు చేసిందన్నారు.కార్మికులు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినప్పటికీ, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ముఖ్యంగా విధుల్లో ఉండి అనారోగ్యానికి గురైన సింగరేణి కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కల్పించే విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. మెడికల్ బోర్డులను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందని, ఏర్పాటు చేసిన బోర్డుల ద్వారా కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు కార్మికులను తిరస్కరిస్తూ, తిరిగి సర్ఫేస్ విధులు లేదా యథావిధిగా డ్యూటీలు చేయాలని సూచిస్తున్నారని విమర్శించారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally

Next Story