Ghanpur: విద్యుత్ కోతలపై గండ్ర వెంకటరమణ రెడ్డి ధర్నా!

Ghanpur: గణపురం మండలం చెల్పూర్‌లో 24 గంటల విద్యుత్ కోసం BRS మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి జాతీయ రహదారిపై ధర్నా. ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 13 Oct 2026 1:23 PM IST
Ghanpur
X

Ghanpur: విద్యుత్ కోతలపై గండ్ర వెంకటరమణ రెడ్డి ధర్నా!

Ghanpur: అక్టోబర్ నెలలో పంటలకు నీరు అత్యవసరమని, మరో నెల రోజుల తర్వాత నీటి అవసరం తగ్గే అవకాశం ఉన్నందున ఈ కీలక సమయంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు.

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని జాతీయ రహదారి పై బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ధర్నా చేపట్టారు. వీరి ధర్నాతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు, లో వోల్టేజీ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని, పంట పొలాలకు సరిపడా నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి తక్షణమే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉందని, మిర్చి పంటకు కూడా నీటి అవసరం అధికంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందించలేని పరిస్థితిలో కనీసం 15 నుంచి 16 గంటలైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల విద్యుత్ అందించలేని అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్శించారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally