Hanamkonda: వేయి స్తంభాల గుడిలో గణపతి నవరాత్రులు ప్రారంభం!
Hanamkonda: హనుమకొండ చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో ఘనంగా గణపతి నవరాత్రుల ప్రారంభం. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
Hanamkonda: వేయి స్తంభాల గుడిలో గణపతి నవరాత్రులు ప్రారంభం!
Hanamkonda: చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ మహా గణపతి నవరాత్రి ఉత్సవాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా అధికారికంగా ప్రారంభించారు.
సోమవారం ఉదయం ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు తన సతీమణి శ్రీమతి నీలిమ రాజేందర్ రెడ్డి గారితో కలిసి వేయి స్తంభాల దేవాలయానికి చేరుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ , ఈఓ డి అనిల్ కుమార్, ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గట్టు మహేష్ బాబు యువ నాయకుడు దేవర విష్ణువర్ధన్ రెడ్డి, పాల్గొన్నారు
అనంతరం ఆలయ మండపంలో కొలువుదీరిన శ్రీ మహా గణపతిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకున్నారు. తదుపరి చారిత్రక శ్రీ రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా గణపతికి శాస్త్రోక్తంగా పూజలు చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మతసామరస్యంతో లోక కళ్యాణం కొరకు అమ్మద గనాదీక్షుడైన పార్వతి పరమేశ్వరుల తనవిడైన ఆ మహాగణపతిని పూజించడం వలన ప్రకృతి సహకరిస్తుందని ప్రకృతిని ప్రేమించు పర్యావరణాన్ని రక్షించు అనే భావనతో భక్తులు పూజలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని భక్తులకు పిలుపునిచ్చారు.




