Garla: గార్లలో ఘనంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
Garla: గార్లలో జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నెహ్రూ సెంటర్లో కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు.
Garla: గార్లలో ఘనంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
గార్ల: వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గార్ల మండల కేంద్రంలో నెహ్రు సెంటర్లు కేక్ కట్ చేసి , ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు , పాలు , బ్రెడ్ ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ గార్ల మండల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాదావత్ యుగంధర్ నాయక్ మాట్లాడుతూ..... సెప్టెంబర్ 2 వచ్చిందంటే ప్రపంచ వ్యాప్తంగా మెగా అభిమానులు , జన సైనికులకు పండగ వాతావరణం నెలకొంటుందని , మండలంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీనియర్లు అనేక కార్యక్రమాలు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు , పాలు పంపిణీ తదితర కార్యక్రమాలను నిర్వహించామని అన్నాడు, ముఖ్య విషయం ఈ రోజు పిఠాపురం లో జనసేన యువజన విభాగం , లోగో ఆవిష్కరణ జరగబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా , జనసేన అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




