Mahabubabad: విద్యార్థిపై దాడి ఘటన సీఐ రఘుపతి రెడ్డిని సస్పెండ్ చేయాలి!

Mahabubabad: పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో జెన్ జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆందోళన. సీఐ రఘుపతి రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్.

HARISH, TARNAKA
Published on: 20 Aug 2026 12:02 PM IST
Mahabubabad
X

Mahabubabad: విద్యార్థిపై దాడి ఘటన సీఐ రఘుపతి రెడ్డిని సస్పెండ్ చేయాలి!

Mahabubabad: మహబూబాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థిపై నిన్న జరిగిన దాడి ఘటనను జెన్ జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన సీఐ రఘుపతి రెడ్డి పై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

జెన్ జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శివాజీ మాట్లాడుతూ విద్యార్థులు తమ సమస్యలను ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని విద్యార్థుల పట్ల పోలీసు అధికారులు సంయమనంతో, చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులపై దాడులు, బెదిరింపులకు పాల్పడే ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థి సమస్యలపై 30న భారీ సభ

విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపాధి అవకాశాలు, హాస్టల్ సమస్యలు, స్కాలర్‌షిప్‌లు తదితర సమస్యల పరిష్కారం కోసం జెన్ జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు.

దీనిలో భాగంగా ఈనెల 30న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా నిర్వహించే భారీ విద్యార్థి సభకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో జెన్ జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ నాగునాయక్, ట్రెజరర్ అంజనేయులు, జయలాల్, ప్రకాష్, రాకేష్, సురేష్, అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story