Jangaon: జనగామ కలెక్టరేట్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు!
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు!
Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్ ఆవరణలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం, పోలీసు బలగాల నుంచి ఆయన గౌరవ వందనం (పరేడ్ సెల్యూట్) స్వీకరించారు.ఈ వేడుకల్లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్ శాలోమ్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




