Maripeda: సర్పంచ్ సోమన్న మృతికి ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ నివాళులు!
Maripeda: మరిపెడ మండలం వెంకంపాడు సర్పంచ్ ఉప్పల సోమన్న రోడ్డు ప్రమాదంలో మృతి. పార్థివదేహానికి నివాళులర్పించిన డోర్నకల్ ఎమ్మెల్యే, విప్ డాక్టర్ రామచంద్రనాయక్.
Maripeda: సర్పంచ్ సోమన్న మృతికి ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ నివాళులు!
Maripeda: మరిపెడ మండలం వెంకంపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గ్రామ సర్పంచ్ ఉప్పల సోమన్న పార్థివ దేహానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సోమన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సర్పంచ్ ఉప్పల సోమన్న మృతి గ్రామానికి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మరిపెడ అధ్యక్షులు రవి నాయక్ గారు, మరిపెడ సర్పంచులు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌతమ్ గారు, బద్రు నాయక్ గారు, మాజీ మరిపెడ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్ గారు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




