Warangal: కాట్రపల్లి గ్రామంలో ఘనంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం!

Warangal: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో ఘనంగా మహా అన్నప్రసాద వితరణ.. ప్రారంభించిన గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి, యువనాయకులు రాపాక ప్రశాంత్.

P ASHOK, WARDHANNAPET
Updated on: 24 Sept 2026 7:24 PM IST
Warangal
X

Warangal: కాట్రపల్లి గ్రామంలో ఘనంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం!

Warangal: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగణపతి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్నీ కాట్రపెల్లి గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో యువనాయకులు "రాపాక ప్రశాంత్ గారు"* ముఖ్య అతిథులుగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా రాపాక ప్రశాంత్ గారు మాట్లాడుతూ, గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శివాజీ యూత్ సభ్యులు,దాతలు గ్రామ ప్రజలు, భక్తుల సహకారంతో కార్యక్రమం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై మహా అన్నప్రసాదాన్ని స్వీకరించి విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, భక్తులకు, దాతలకు మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET