Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు
Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా పాల్గొని బహుమతులు అందించారు.
Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బతుకమ్మ వేడుకలు అంబరానంటాయి. అన్ని శాఖల లోని మహిళా ఉద్యోగులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఒక చోట చేర్చి బతుకమ్మ సంప్రదాయ పాటలకు కోలాటాలు , నృత్యాలతో హోరోత్తించారు.
ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని నృత్యాలు చేశారు. అందమైన బతుకమ్మలకు ఎమ్మెల్యే బహుమతులను ప్రధానం చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ మహిళలను స్మరించుకుంటూ మహిళల పేర్లపై ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని , కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు.




