Seerole: సీరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Seerole: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రమణమ్మ, అధికారులు పాల్గొన్నారు.
Seerole: సీరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సీరోలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీరోలు మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు, గ్రామ ఆడపడుచులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ అనుమంతుల రమణమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మండల అభివృద్ధి అధికారి ఎండీ గౌస్, తహసీల్దార్ పూర్ణచందర్, ఏపీఓ భూపాల్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే అంగన్వాడీ టీచర్లు నందారపు నాగమణి, తగరం మంగమ్మ, వెలుగు సీఏలు శ్యామల సునీత, మక్కల ప్రియాంక, జిల్లెల్ల ఉష, జ్యోతి, రాజమణి, పంచాయతీ కార్యదర్శి టి. యుగంధర్, పంచాయతీ సిబ్బంది, సీరోలు గ్రామ మహిళలు తదితరులు పాల్గొని బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.




