Parkal: పరకాలలో చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు!
Parkal: పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్‌ఎస్ శ్రేణులు. ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, ఆసుపత్రిలో పండ్ల పంపిణీ.
Parkal: పరకాలలో చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు!
Parkal: పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు చల్లా ధర్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీ భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చల్లా ధర్మారెడ్డి ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.అనంతరం స్థానిక బస్టాండ్ కూడలిలో చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ధర్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా చల్లా ధర్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి పండ్లు అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చల్లా ధర్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు




