Mahabubabad: జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన మహబూబాబాద్.. భారీ శోభాయాత్ర!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 12 May 2026 1:18 PM IST
Mahabubabad
X

Mahabubabad: జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన మహబూబాబాద్.. భారీ శోభాయాత్ర!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో హనుమాన్ ఆలయాలకు చేరుకొని అభిషేకాలు, హోమాల, ఆకు పూజలు, ప్రత్యేక పూజలు చేసి తీర్థ, ప్రసాదాలను స్వీకరించారు. మహబూబాబాద్ పట్టణం లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం నుంచి విశ్వహిందూ పరిషత్, బజరంగదళ, బీజేపీ శ్రేణుల అధ్వర్యంలో మేళ తాళాలతో, బాణాసంచా కాలుస్తూ వీర హనుమాన్ శోభాయాత్ర ను పురవీధుల గుండా నిర్వహించారు. జైశ్రీరామ్ అనే నినాదాలు శోభా యాత్రలో మారుమూగాయి. కాషాయ జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శోభయాత్రలో భక్తుల కు ప్రసాద వితరణ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story