Kataram: కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు!

Kataram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఆదర్శనగర్‌లో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. మహిళల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Sept 2026 1:07 PM IST
Kataram
X

Kataram: కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు!

Kataram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.

ఉత్సవాలు నేటితో ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం గణపతి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శనగర్‌తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులు ప్రతిరోజూ వివిధ ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉత్సవాలను ముందుకు తీసుకెళ్తున్నారు. గణపతి మండపం వద్ద భక్తులతో సందడి నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్