Gudur: గూడూరు మండలంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
Gudur: గూడూరు మండలంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూల పూజలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు చికటి శ్రీను మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రజల హృదయాల్లో ఆయనను శాశ్వతంగా నిలిపాయి. ఆయన ఆశయాల సాధనకు, పేదల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుండెంగ గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




