Gudur: రాజన్‌పల్లి జీపీ భవనాన్ని ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే
Gudur: మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ గూడూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు.
Gudur: రాజన్‌పల్లి జీపీ భవనాన్ని ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే
Gudur: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు మండలంలోని రాజన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో రాజన్ పల్లి గ్రామంలో సర్పంచ్ ను ఏకగ్రీవం చేయడంతో గ్రామానికి ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు గ్రామంలో రోడ్లు గాని సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు గ్రామ సర్పంచ్ జాటోత్ మంగమ్మ రవి నాయక్ ను సన్మానించారు
మండలం లోని బ్రాహ్మణ పల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 53లక్షల రూపాయల నిధులు కేటాయించి మౌలిక వసతుల అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టారు పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి మెమొంటోలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఉన్నారు. మండలంలోని పల్త్యా తండాకు చెందిన బోడ రమేష్ పులమ్మ దంపతులు ఇటీవల ఖానాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు అలాగే మండలంలోని సీతానగరం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సిఆర్పిఎఫ్ జవాన్ బొమ్మగాని శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రమేష్ చందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు నాయకులు వాంకుడోత్ కొమ్మలు , బీరం శ్రీపాల్ రెడ్డి , బుడిగ సతీష్, చంటి స్వామి, బొల్లికొండ మధు, పూజారి శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..




