Gudur: గూడూరులో 8 కిలోల గంజాయి పట్టివేత.. నిందితుడి అరెస్ట్

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద తనిఖీల్లో రూ.4.18 లక్షల విలువైన 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

B NARASIMHA, GUDUR
Published on: 25 Sept 2026 8:51 PM IST
Gudur
X

Gudur: గూడూరులో 8 కిలోల గంజాయి పట్టివేత.. నిందితుడి అరెస్ట్

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 8 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

గూడూరు సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ బాబు సిబ్బందితో కలిసి బ్రాహ్మణపల్లి సమీపంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ ఆటో నుంచి దిగిన ఒక వ్యక్తి పోలీసులను చూసి అనుమానాస్పదంగా మెలిగాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద 8 కిలోల గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ. 4,18,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

నిందితుడిని విచారించగా... ఒడిశా రాష్ట్రంలో ఈ గంజాయిని కొనుగోలు చేసి, కర్ణాటకలోని బీదర్‌కు తరలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నాడు. మార్గమధ్యలో బ్రాహ్మణపల్లి వద్ద తనిఖీల్లో దొరికిపోయాడని సిఐ వినయ్ కుమార్ తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అయన వెల్లడించారు. గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, వినియోగం లేదా అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిరోధానికి గూడూరు పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని స్పష్టం చేశారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR