Guduru: గూడూరు మండల సమావేశానికి సర్పంచులు గైర్హాజరు – ఎమ్మెల్యే ఆగ్రహం
Guduru: గూడూరు మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచులు గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే మురళీ నాయక్ తీవ్ర ఆగ్రహం. ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా ఉండాలని హితవు.
Guduru: గూడూరు మండల సమావేశానికి సర్పంచులు గైర్హాజరు – ఎమ్మెల్యే ఆగ్రహం
గూడూరు: మహబూబాబాద్ గూడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన మండల సమన్వయ సమీక్ష సమావేశానికి సర్పంచులు గైర్హాజరు కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గూడూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సమీక్షే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అయితే, కీలకమైన ఈ భేటీకి వివిధ గ్రామాల నుంచి సర్పంచులు రాకపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరైనప్పటికీ సర్పంచులు పెద్ద సంఖ్యలో గైర్హాజరు కావడంపై మండల వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం ఉందా లేక ప్రభుత్వ తీరుపై నిరసనతోనే ఈ విధంగా దూరంగా ఉన్నారా అనే కోణంలో స్థానికులు, రాజకీయాధికారులు జోరుగా చర్చించుకుంటున్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.




