Jangaon: లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధికి నూతన కార్యవర్గం ఏర్పాటు!
Jangaon: జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ కిష్టబావి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Jangaon: లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధికి నూతన కార్యవర్గం ఏర్పాటు!
జనగామ: జనగామ పట్టణంలో స్థానిక గుండ్ల గడ్డ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నందు గత 39 వసంతాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. వార్డులో ఉన్న స్థానికులు,పెద్దలు, యువతి యువకులు, అందరూ కలిసి ఐకమత్యంతో జరుపుకోవడం జరుగుతుంది. ఈ గణేష్ నవరాత్రులు వార్డులో ఒక పండుగ వాతావరణాన్ని కలిగిస్తుంది.
నీకు కిష్ట బావి వద్ద ఆ స్థల ప్రభావంతో భక్తిశ్రద్ధలతో ఎవరు ఏ కోరిక కోరుకున్న ఆ గణేష్ మహారాజు ఆ భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చే గణపతిగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఆలయ అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో వార్డులోని ప్రముఖులు, యువకులు అందరూ సమావేశమై ఆలయానికి ఒక దేవాలయ కమిటీ ఉంటే ఇంకొంత అభివృద్ధి చెందుతుందని ఉద్దేశంతో ఆదివారం నూతన ఆలయ కమిటీని హాజరైన సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ రాబోయే రెండు సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ కమిటీ:
అధ్యక్షులు గట్టు రమేశ్, ఉపాధ్యక్షులు చిదిరలా బాబురావు, కోశాధికారి కోయలకర్ శేషు విరాట్ జీ, ప్రధాన కార్యదర్శి గుధినేని త్రయంబకేశ్, గౌరవ అధ్యక్షులు వడ్నల లింగమూర్తి, సహాయ కార్యదర్శులు ఆకుల నరేష్, గోగికర్ శివాజి, కొత్తపల్లి సత్తయ్య, ఆర్గనైజర్: చెల్లోజు నవీన్ చారి, ముఖ్య సలహా దారులు: ఎర్రమళ్ళ సుధాకర్. మిర్యాల రమేష్.కొండ వీరేశం. ఆర్మీ ప్రవీణ్ కుమార్.మురళి.




