Warangal: బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి!

Warangal: వరంగల్ నగరంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లను జిడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న పరిశీలించారు. చెరువుల వద్ద పారిశుధ్యం, విద్యుత్ దీపాలపై సూచనలు చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 14 Oct 2026 9:25 AM IST
Warangal
X

Warangal: బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి!

Warangal: బతుకమ్మ వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో, ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రేటర్ వరంగల్ లోని చిన్నవడ్డేపల్లి, బేస్తం చెరువు, ఉర్స్ చెరువు, బంధం చెరువు, పద్మాక్షి గుండం తదితర చెరువుల ప్రాంతాల వద్ద బతుకమ్మ ఏర్పాట్లను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రత, బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు.

అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, ఈఈలు సంజయ్ కుమార్, రవికుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST