Warangal: నగర ప్రజలకు కమిషనర్ వెంకన్న బతుకమ్మ శుభాకాంక్షలు
Warangal: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న నగర ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Warangal: నగర ప్రజలకు కమిషనర్ వెంకన్న బతుకమ్మ శుభాకాంక్షలు
వరంగల్ జిడబ్ల్యూఎంసీ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను నగర మహిళలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ *టి. వెంకన్న* ఆకాంక్షించారు.
ప్రకృతిని పూలతో పూజిస్తూ, మహిళల ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు, సౌభాగ్యాలు నింపాలని, తెలంగాణ సంస్కృతి వైభవం తరతరాలకు కొనసాగాలని ఆయన ఆకాంక్షిస్తూ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.




