Jangaon: జనగామలో భక్తిశ్రద్ధలతో గ్యారవీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు!
Jangaon: జనగామలో హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి గ్యారవీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Jangaon: జనగామలో భక్తిశ్రద్ధలతో గ్యారవీ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు!
Jangaon: జనగామ హైదరాబాద్ రోడ్డులోని హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి గౌసే ఆజం దస్తగిరి చిల్లా ముబారక్ వద్ద గురువారం గ్యారవి షరీఫ్ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు హాజరయ్యారు. జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి గారు సైతం ఇట్టి ఉత్సవాల్లో పాల్గొని అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కులమతాలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి చిల్లా ముబారక్‌ను దర్శించుకున్నారు. ఉత్సవాల్లో సుమారు వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అనంతరం భక్తుల కోసం ఫాతిహా మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు మరియు పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.




