Hanamkonda: హనుమకొండలో ఘనంగా చెకుముకి బాలల సైన్స్ సంబురాలు
Hanamkonda: హనుమకొండలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబురాలు జరిగాయి; వివిధ విభాగాల్లో విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
హనుమకొండ: జన విజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి బాలల సైన్స్ సంబరాలు శనివారం హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో గల స్పెక్ట్రా గ్లోబల్ కాన్సెప్ట్ స్కూల్లో జిల్లా అధ్యక్షులు కె.బి. ధర్మ ప్రకాష్ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ),వరంగల్ ప్రొఫెసర్ ఎల్.అంజనేయులు మాట్లాడుతూ నేటి శాస్త్ర సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మూఢవిశ్వాసాలు సమాజ పురోగతికి ఆటంకాలుగా మారుతాయన్నారు.ప్రశ్నించడం, పరిశీలించడం,ఆధారాలతో నిజానిజాలను నిర్ధారించుకోవడం ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి జె. దయాకర్ ఆరోగ్య పోస్టర్ను, చెకుముకి రాత పరీక్ష ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు.ఎన్ఐటీ వరంగల్ విశ్రాంత ఆచార్యులు లక్ష్మారెడ్డి పేరెంట్స్ ను,ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలోని 14 మండలాల నుంచి ఎంపికైన 126 మంది విద్యార్థులు తమ గైడ్ ఉపాధ్యాయులతో కలిసి ఈ సైన్స్ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన 27 మంది విద్యార్థుల్లో విజ్ఞాన ఆసక్తిని పరిశీలన శక్తిని, సమయస్ఫూర్తిని,సృజనాత్మకతను వెలికి తీసే విధంగా డైరెక్టర్ రౌండ్, రాపిడ్ ఫెయిర్,విజువల్,క్రియేటివ్ మరియు ప్రయోగత్మక రౌండ్ లలో క్విజ్ పోటీలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల భాగంలో జడ్పీహెచ్ఎస్ కడిపికొండ,రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో ఎం జె పి ఐనవోలు, ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ఎస్ ఆర్ ప్రైమ్ పాఠశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయి చెకుముకి సంబరాలకు ఎంపిక కాబడినారు.ఈ పోటీలకు శ్రీనివాస్,సుమలత,ధర్మ ప్రకాష్, ప్రొఫెసర్ ఆంజనేయులు, కుమారస్వామి,భాస్కర్,బి రాధ క్విజ్ మాస్టర్లుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రౌతు అజయ్ కుమార్, కోశాధికారి ఉమ మహేశ్వర్ రావు,చెకుముకి జిల్లా కన్వీనర్ కుమారస్వామి, సోషల్ మీడియా కన్వీనర్ పరికిపండ్ల వేణు,సమతా కన్వీనర్ సుమలత,వకుళాభరణం శ్రీనివాస్,రెహమాన్,నిట్ విశ్రాంత ఆచార్యులు రామారావు,డాక్టర్ సాయి కుమార్,బూర భిక్షపతి,బి రాధా,అంకం శ్రీనివాస్,బిక్షపతి, అశోక్,విద్యావతి,రహమాన్, సారంగపాణి,తదితరులు పాల్గొన్నారు.




