Hanamkonda: వంగరలో పీవీ విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

Hanamkonda: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో పీవీ విజ్ఞాన కేంద్రం పనులను పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్. త్వరగా పూర్తి చేయాలని ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 23 July 2026 6:50 PM IST
Hanamkonda
X

Hanamkonda: వంగరలో పీవీ విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

హనుమకొండ: జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గురువారం పరిశీలించారు.

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు స్వగ్రామంలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులు తుది దశకు చేరడంతో క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ అభివృద్ధి పనులను పరిశీలించారు.

విజ్ఞాన కేంద్రంలోని ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, ప్రాంగణంలో నాటిని మొక్కలు, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు, తాగునీటి సౌకర్యాలు, నిర్వహణను కలెక్టర్ స్వయంగా పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుది దశకు చేరుకున్న పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రం నిర్వహణ మెరుగ్గా ఉండాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సృజన, కుడా సీపీవో అజిత్ రెడ్డి, డీఈ రఘు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, ఇతర అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story