Hanamkonda: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

Hanamkonda: గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 7 Sept 2026 7:10 PM IST
Hanamkonda
X

Hanamkonda: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

Hanamkonda: సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాల నిర్మాణ పనుల పురోగతిపై పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, డీఆర్డీఏ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా అభివృద్ధి పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు మహిళా సంఘాల భవనాల నిర్మాణ, తదితర అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.

పూర్తయిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల రికార్డు ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేసి, సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనులు అవసరమైన గ్రామాలను గుర్తించి, ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల ను ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డీఆర్డీవో మేన శ్రీను, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ డీఈలు రాజగోపాల్ రావు, శ్రీనివాస్ రావు, శిరీష, యుగంధర్, రామ్ దేవ్ అగర్వాల్, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story