Hanamkonda: హనుమకొండలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె!
Hanamkonda: హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని కోరగా, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమ్మెకు మద్దతు తెలిపారు.
Hanamkonda: హనుమకొండలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె!
హనుమకొండ: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించి తమను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మద్దతు ప్రకటించి, సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఆయుష్ వైద్యులు మరియు సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టారు.
సుదీర్ఘకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్న NHM ఉద్యోగులను, వైద్యులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలనీ రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులందరికీ 100% గ్రాస్ శాలరీ చెల్లించాలనీ డిమాండ్ చేశారు. కరోనా లాంటి విపత్కర సమయం లో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన nhm వైద్యులు సిబ్బంది న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలన్నారు.




