Hanamkonda: అనారోగ్యంతో ఉన్న మిత్రుడికి రూ.29 వేల సాయం!
Hanamkonda: హనుమకొండ జిల్లా దామెరలో అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడు కృష్ణమూర్తికి కాకతీయ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.29,000 సాయం చేశారు.
Hanamkonda: అనారోగ్యంతో ఉన్న మిత్రుడికి రూ.29 వేల సాయం!
హనుమకొండ: హనుమకొండ జిల్లా మానవత్వం చాటుకున్న కాకతీయ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.. అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడికి రూ. 29 వేల ఆర్థిక సహాయం, దామెర: స్నేహానికి నిదర్శనంగా నిలిచారు 1987-88 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు. ఆపదలో ఉన్న తమ మిత్రుడిని ఆదుకుని మానవత్వాన్ని చాటుకున్నారు.
దామెర మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన బెజ్జల కృష్ణమూర్తి మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కాకతీయ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గొల్లపూడి విజయవాడ సభ్యులు స్పందించారు.1987-88 బ్యాచ్ పదవ తరగతి స్నేహితులు కలిసి రూ. 29 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సేకరించి కృష్ణమూర్తి కుటుంబానికి అందజేశారు.
తమ కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థికంగా ఆదుకున్న అసోసియేషన్ సభ్యులకు కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ మొరంపూడి శ్రీనివాస్ రావు, సెక్రెటరీ కాగితాల హరిప్రసాద్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.




