Hanamkonda: హనుమకొండలో స్వేరో ఆత్మీయ సమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ!
Hanamkonda: హనుమకొండలో స్వేరో ఆత్మీయ సమ్మేళన పోస్టర్ ఆవిష్కరించిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఈ నెల 22న భారీ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వెల్లడి.
Hanamkonda: హనుమకొండలో స్వేరో ఆత్మీయ సమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ!
Hanamkonda: హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వద్ద స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం రోజున నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు హాజరు అయ్యారు.
అనంతరం పార్టీ శ్రేణులు, స్వేరో సభ్యులతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం రాసిన భారత రత్న డా. బీఆర్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం, స్ఫూర్తితో తెలంగాణ ప్రజలకు ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.
కేసీఆర్ గారు 1000 పైగా గురుకులాలను ఏర్పాటు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్య అందేలా చేశారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చదివిన ఎందరో విద్యార్థులు గొప్ప గా ఎదిగారని తెలిపారు. పూర్ణ, ఆనంద్ ఎవరెస్టు అధిరోహించారు, వేలాది విద్యార్థులు డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యారని వివరించారు.
కేసీఆర్ గారి ఆలోచనను ఆచరణలో చూపిన నాటి గురుకులాల సెక్రటరీ, నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని కొనియాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వేరో ఆర్గనైజేషన్ స్థాపించారని, ఈ ఆర్గనైజేషన్ సమాజానికి ఎంతో మేలు చేస్తోందని అన్నారు. స్వేరో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఈ నెల 22న నిర్వహించనున్న స్వేరో ఆర్గనైజేషన్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
నిర్వాహకులు మంద శ్యామ్ కుమార్ మాట్లాడుతూ స్వేరో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని10 వేల మందితో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వేరో ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, మాజీ ఐపీఎస్ అధికారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హాజరవుతారని అన్నారు.
స్వేరో సంస్థ బహుజనుల ఆర్థికం ఆత్మగౌరవం ఆకాంక్షలు మేరకు పని చేస్తుందని తెలిపారు.
పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గారు విద్యకు ప్రాధాన్యం ఇచ్చి పేద పిల్లలు ఉన్నత చదువులు చదివేలా చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి స్వేరోలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నార్లగిరి రమేష్, పులి రజినీకాంత్, వేల్పుల వేణు, జానకిరాములు, సుంచు కృష్ణ, కాటాపూర్ రాజు, అఫ్జల్, ఎస్కే మహమూద్, యాదగిరి, రఘు, గబ్బెట శ్రీనివాస్, శివకుమార్, పబ్బోజు శ్రీకాంత్ చారి, సౌరం రఘు, బీఆర్ఎస్ నాయకులు నీలం రాజ్‌కిషోర్, మూటిక రాజు యాదవ్, తక్కళ్లపల్లి వినీల్ రావు, స్వేరో వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ చాతల్లా వేణుగోపాల్, పరకాల నియోజకవర్గం కన్వీనర్ ఒంటేరు చక్రి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తెల్లూరి సురేష్ వంశీ కో కన్వీనర్ రాజేశ్వరి, రజిత, మౌనిక, ఓంకార్ యాదవ్, భూపాలపల్లి నియోజకవర్గం కో కన్వీనర్స్ వినోద్ కిరణ్ దుగ్గొండి మండల కన్వీనర్ గోర్కటి రాజ్కుమార్, ప్రవీణ్ మురారి SMH హాస్టల్స్ ఇంచార్జ్ అఖిల్, మైపాల్, స్టాలిన్ రాహుల్ శ్రీహస్ అర్జున్ ETC మొదలగు వారు పాల్గొన్నారు.




