Hanamkonda: బాకీ డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

Hanamkonda: ల్యాండ్ డీల్‌లో రావాల్సిన రూ. 17 లక్షల బాకీ ఇవ్వకుండా వేధిస్తుండటంతో, మనస్తాపానికి గురైన వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

AJAY, HANMAKONDA
Published on: 18 Jun 2026 3:50 PM IST
Hanamkonda
X

Hanamkonda: బాకీ డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

Hanamkonda: హనుమకొండ జిల్లా హంటర్ రోడ్ దుర్గ కాలనీలో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాజీపేట్ వెంకటద్రి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే బాధితులు చెప్పిన కథనం ప్రకారం చంద్రశేఖర్ నాన్న కు డయాలసిస్ చేయించేందుకు డబ్బు అవసరమై భూమిని అమ్ముకున్నానని తన వద్ద ఉన్న హంటర్ రోడ్ సమీపం లో గల 227 గజాల భూమిని ఏడాది క్రితం 69 లక్షలకు కొనుగోలు చేసిన రవీందర్ రావు అనే వ్యక్తి 52 లక్షల రూపాయలు పలు దఫాలలో ముట్టజెప్పి మరో 17 లక్ష్యలకు చెక్కు రూపం లో ఇచ్చాడని ఆ చెక్కు బ్యాంకు లో వేయగా అందులో డబ్బు లేకపోవడంతో బౌన్స్ అయిందని,

ఈ విషయాన్ని రవీందర్ రావుకు తెలుపగా రేపు మాపు అంటూ 8 నెలలు గడిచాయి పలుమార్లు తన ఇంటికి వెల్లి తమకు రావాల్సిన మిగతా డబ్బులు తమకు ఇవ్వాలని ఎన్ని సార్లు అడిగినా దాటవేస్తు ఎదో కారణాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చంద్రశేఖర్ ఆరోపించాడు. పలుమార్లు డబ్బులు అడిగినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story