Damera: దామెర మండలంలో విషాదం హాస్టల్కు వెళ్లనని ఇంటర్ విద్యార్థి మృతి!
Damera: దామెర మండలం సింగరాజుపల్లిలో విషాదం. హాస్టల్కు వెళ్లేందుకు ఇష్టపడక మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Damera: దామెర మండలంలో విషాదం హాస్టల్కు వెళ్లనని ఇంటర్ విద్యార్థి మృతి!
దామెర: హాస్టల్కు వెళ్లేందుకు ఇష్టపడక మనస్తాపానికి గురైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన దామెర మండలం సింగరాజుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లికి చెందిన కుమ్మరి నాగరాజు కుమారుడు కుమ్మరి మదీర్ (16) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ నెల 7వ తేదీన హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన మదీర్ తిరిగి హాస్టల్కు వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో తండ్రి నాగరాజు మంచిగా చదువుకోవాలని సూచించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన మదీర్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




